తూర్పు కోస్తా రైల్వే... దసరా పండగా దృష్ట్యా ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా విశాఖ-సికింద్రాబాద్ నడుమ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విశాఖ-సికింద్రాబాద్ నడుమ నడిచే ఈ రైలు ఈనెల 13, 20, 27 తేదీల్లో విశాఖ నుంచి సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ఈనెల 14, 21, 28 తేదీలలో రాత్రి ఏడుగంటల 40 నిమిషాలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల 40 నిమిషాలకు విశాఖ చేరుతుంది.
మరో రైలు ఈనెల 19, 26, నవంబర్ 2వ తేదీల్లో విశాఖ నుంచి సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ఈనెల 20, 27, నవంబర్ 3వ తేదీల్లో రాత్రి 9: 05 నిమిషాలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.50 నిమిషాలకు విశాఖ చేరుతుంది.
విశాఖ-తిరుపతి-విశాఖ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 18 ,25, నవంబర్ 1 తేదీల్లో విశాఖ నుంచి రాత్రి 7:15కు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం ఏడున్నరకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో ఈనెల 19, 26, నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9:55 నిమిషాలకు బయలుదేరి, మరుసటి రోజుఉదయం 10:20 నిమిషాలకు విశాఖ చేరుతుంది.
ఇదీ చదవండి: