ETV Bharat / state

వాల్తేరు డివిజన్​లో ఈ-వాహనాల వినియోగం - వాల్తేరు డివిజన్​లో విద్యుత్ వాహనాలు

రైల్వేలలో తొలిసారిగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టిన ఘనత వాల్తేర్ డివిజన్కు దక్కించుకుంది. డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్​తో నడిచే వాహనాలను వివిధ అవసరాలకోసం వినియోగించనుంది. డివిజన్ పరిధిలో 50శాతం ఈ-వాహనాలను ఉపయోగించడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.

E-Vehicle Utilization in Walther Division Vishakhapatnam
వాల్తేరు డివిజన్​లో ఈ-వాహనాల వినియోగం
author img

By

Published : Jun 13, 2020, 8:42 PM IST

తూర్పుకోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం సహకారంతో వాల్తేర్ డివిజన్​లో ఈ-వాహనాలను సరకు రవాణా కోసం వినియోగిస్తామని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో వాల్తేరు డీ.ఆర్.ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు షాలిని శ్రీవాస్తవ నాలుగు ఈ-వాహనాలను ప్రారంభించారు. పర్యావరణ హితమైన వీటిని ఉపయోగించడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుతం సిబ్బంది అవసరాల కోసం డివిజన్​లో యాభైకి పైగా అద్దె వాహనాలను ఉపయోగిస్తున్నామని.. ఏటా ఒక్కో వాహనానికి రూ.8,43,000 ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. దాదాపు రెండు లక్షల రూపాయలతో ఈ-వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ.34,000 వేల రూపాయలకే ఏడాది పాటు వినియోగించుకోవచ్చని వెల్లడించారు.

డీజిల్ వాహనాల స్ధానంలో 50 శాతం వరకు ఈ-వాహనాలను ఉపయోగించడమే తమ ఉద్దేశమని డీ.ఆర్.ఎం. చేతన్ కుమార్ శ్రీవాస్తవ వివరించారు. రైల్వేపై భారం పడకుండా మహిళా సంక్షేమ సంఘం తమ వంతుగా సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని తూర్పుకోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు షాలిని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. జిల్లా జైలుకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.