విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో వేలాది మంది వలస కార్మికులు రోడ్డెక్కారు. హెచ్పీసీఎల్, ఎల్ అండ్ టీ.. వంటి సంస్థల్లో పనిచేస్తున్న కూలీలు... తమను సొంత రాష్ట్రాలకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. వలస కార్మికులతో గంగవరం పోర్టు రహదారి నిండిపోయింది.
వలస కార్మికులకు నచ్చజెప్పేందుకు గుత్తేదారులతో.. హార్బర్ ఏసీపీ మోహనరావు చర్చలు జరుపుతున్నారు. తమకు రెండు నెలలుగా జీతాలు లేవని, స్వస్థలాలకు పంపాలని బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: