విశాఖలో ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో సీఎం వాహనశ్రేణి వెళ్లే మార్గంలో డీఎస్సీ-2008 అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు అడ్డుకోవడం వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక ఉన్నచోట నుంచే నినాదాలు చేశారు. ఉన్న ప్రైవేట్ ఉద్యోగం పోయి.. డీఎస్సీ రాక నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు వచ్చినా... ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు స్పందించాలని... మాకు న్యాయం చేయాలని డీఎస్సీ-2008 అభ్యర్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరుకానున్న సీఎం