మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఓల్డ్ పోర్టు క్వార్టర్స్‌లోని ఓ పాత భవనంలో మాదక ద్రవ్యాలు ఉన్నాయనే సమాచారంతో నాల్గొవ పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. భవనంలోని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని..వారి నుంచి 61ఎల్ఎస్డీ బ్లాట్లు, 60 గ్రాముల గంజాయి, 2.5 గ్రాముల ఎండీఎంఏ, 9,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సత్యనారాయణ, అజయ్, రవి, స్వరూప్‌పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖలో మాదక ద్రవ్యాల ముఠా అరెస్టు - మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ముఠా అరెస్టు
విశాఖ ఓల్డ్ పోర్టు క్వార్టర్స్‌లో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.