విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండలం రంపుల ఘాట్ రహదారిలో ఇరువైపులా తుప్పలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటి వల్ల రహదారిలో ప్రయాణించే వాహన చోదకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించక..అక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ..స్పందిచే వారే కరువయ్యారు. వారి బాధలను చూసిన గూడెంకొత్తవీధి జీసీసీ గ్యాస్ గోదాములో డ్రైవర్‌గా పనిచేస్తున్న చాపరాతిపాలెంకి చెందిన వంతల జాన్‌బాబు రహదారి బాగు కోసం నడుంబిగించాడు.
చేసేది తాత్కాలిక ఉద్యోగమైనా ఉద్యోగానికి సెలవుపెట్టి ...రోజుకు 20 మంది కూలీలను పెట్టి తన సొంత ఖర్చుతో వాటిని తొలగిస్తున్నాడు. రంపుల నుంచి కాట్రగెడ్డ వరకూ ఉన్న 16 కిలోమీటర్ల ఘాట్ రహదారిలో పనులు చేస్తున్నారు. కూలీలకు భోజనాలు ఏర్పాటుచేస్తున్నాడు. వీటివల్ల ఎందరో ప్రమాదాలకు గురైన అధికారులు స్పందించడం లేదని..అతను తెలిపాడు. అందుకే తనవంతు బాధ్యతగా వాటిని తొలగిస్తున్నానని జాన్‌బాబు పేర్కొన్నాడు.
ఇదీ చూడండి. 'మీకు ప్యాలెస్‌లు కావాలి కానీ...పేదోడు మాత్రం రేకులు షెడ్డుతో సరిపెట్టుకోవాలా?'