విశాఖలో కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ... మద్యం దుకాణాలు వద్ద మాత్రం నిబంధనలు పాటించిన ఆనవాలు కనిపించడం లేదు. భౌతికదూరం పాటించకుండా, మాస్క్ లేకుండా, మద్యం కోసం బారులు తీరిన దృశ్యాలు జిల్లా మొత్తం కనిపిస్తున్నాయి. ఆదివారం కావడంతో మద్యం ప్రియులు గొడుగులు వేసుకొని వైన్ షాపుల వద్ద బారులు తీరారు. ఐతే కరోనా నియమాల్లో తప్పనిసరైన మాస్క్, భౌతికదూరాన్ని విస్మరించారు.
ఇవీ చూడండి...