DCIL third quarter results: డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) మూడో త్రైమాసికంలో స్వల్పలాభాలను నమోదు చేసింది. 29 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ ఎండీ జీవైవీ విక్టర్ తెలిపారు. ఈ త్రైమాసికంలో రూ.241 కోట్ల టర్నోవర్ నమోదు చేశామని.. ఇది గత ఏడు త్రైమాసికాల్లో కన్నా అత్యధికమని చెప్పారు.
ఈనెల 20 కేంద్ర మంత్రి సోనోవాల్ సమక్షంలో కొత్త డ్రెజ్జర్ కొనుగోలుకు.. కొచ్చి షిప్ యార్డ్‌కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తామని తెలిపారు. మారిటైం విజన్ 2030లో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఇదీ చదవండి