ETV Bharat / state

'సీబీఐ దర్యాప్తుతో నిజాలు బయటకొస్తాయనే నమ్మకం ఉంది' - డాక్టర్ సుధాకర్ తల్లి వార్తలు

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ దర్యాప్తుపై అతని తల్లి, దళిత సంఘాలు సంతృప్తి వ్యక్తంచేశాయి. సీబీఐ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తన కొడుకుపై దాడి చేసిన వాళ్లు, అతనికి మతిస్థిమితం లేదని నిర్ణయించడం దారుణమని సుధాకర్ తల్లి కావేరి బాయి ఆవేదన వ్యక్తం చేశారు.

dr .sudhakar's mother happy for cbi take up case of her son
సీబీఐపై విచారణపైదళిత సంఘాల హర్షం
author img

By

Published : May 30, 2020, 6:44 PM IST

డాక్టర్ సుధాకర్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐను అతని తల్లి ప్రశంసించారు. తన కుమారుడికి వైద్యం అందిస్తున్న వారంతా విచారణ ఎదుర్కొంటారని.. ఇందులో వాస్తవాలు తెలుస్తాయని కావేరిబాయి నమ్మకం వ్యక్తంచేశారు. పార్టీలకు అతీతంగా దళితులంతా ఏకం కావాలని దళిత సంఘాల కన్వీనర్ వెంకట్రావు పిలుపునిచ్చారు.

సుధాకర్​ను హింసించడాన్ని దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. వెంకట రామిరెడ్డి అనే వైద్యుడు సుధాకర్​పై దాడి చేసిన నిందితులకు సమీప బంధువు అని.. చికిత్స పేరుతో అవసరం లేని మందులు ఇస్తున్నారని ఆరోపించారు.

ఇదీచూడండి. డా.సుధాకర్ అరెస్టుపై సీబీఐ దర్యాప్తు.. అధికారులపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.