వైద్యుడు సుధాకర్‌కు సరైన వైద్య సదుపాయం అందడం లేదని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌కు రాసిన లేఖపై వారు స్పందించారు. మరో ఆసుపత్రిలో చికిత్స అందించాలని కోరారు.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిపై మానసిక రోగి అని ముద్ర వేసి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రభావం చూపించే మందులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడిని వివరాలు అడిగినప్పటికీ తమకు ఏ విధమైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: