ETV Bharat / state

అన్నం పెట్టిన విశ్వాసం... యజమాని ఆచూకీ చెప్పిన శునకం...

ఆదరించిన యజమాని జాడ లేదని దిగాలుగా కూర్చోలేదు. అన్నం పెట్టిన విశ్వాసాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాయి ఈ శునకాలు. ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన తమ యజమాని ఆచూకీ కోసం వాగు పరివాహకంలో వెతుకులాడాయి. విగతజీవుడైన యజమాని మృతదేహాన్ని కనుగొన్నాయి...విశ్వాసంలో తమకు తామే సాటి అని మరోమారు నిరూపించుకున్నాయి. విశాఖ మన్యంలో చోటుచేసుకున్న ఈ సంఘటన శునకాల విశ్వాసానికి గుర్తుగా నిలుస్తుంది.

విశ్వాసానికి సాటి...యజమాని జాడను కనుగొన్న శునకాలు
author img

By

Published : Aug 28, 2019, 5:31 AM IST

Updated : Aug 28, 2019, 10:33 AM IST

విశాఖ మన్యం పాడేరు మండలం పాతరపుట్టు గ్రామంలో ఈ నెల 8న లక్ష్మయ్య అనే రైతు వరద ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయాడు. అధిక వర్షాలతో వాగు ప్రవాహం ఉద్ధృతిగా ఉండడం వలన బంధువులు, గ్రామస్థులకు లక్ష్యయ్య ఆచూకీ దొరకలేదు. పాతరపట్టుతో పాటు వాగు పరివాహక గ్రామాల్లో 20 రోజులపాటు గాలింపు చేపట్టిన ఉపయోగం లేకపోయింది.

జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం

ఇసుకను తవ్వి మరీ..!

కొడుకు లక్ష్మయ్య కోసం చుట్టుపక్కల గ్రామాల్లో వెతికే ప్రయత్నంలో తండ్రి సన్యాసి.. తాము పెంచుకుంటున్న పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవాడు. రోజులాగే వెతకడానికి వెళ్లిన లక్ష్మయ్య తండ్రి... పాతరపట్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో కోడాపుట్టు మత్స్యగెడ్డ ఒడ్డున ఇసుకలో కూరుకుపోయిన మృతదేహం కనిపించింది. తనతోపాటు వచ్చిన శునకాలు వెంటనే యజమాని లక్ష్మయ్యను గుర్తుపట్టి ఇసుకను తవ్వటం మొదలుపెట్టాయి. లక్ష్మయ్య వేసుకున్న చొక్కా ఆధారంగా తండ్రి సన్యాసి... కొడుకు మృతదేహాన్ని గుర్తుపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

విశ్వాసాన్ని చాటాయి..

లక్ష్మయ్య ఆచూకీ తెలియక చింతిస్తున్న కుటుంబ సభ్యులకు... తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నాయి ఈ శునకాలు. యజమాని మృతదేహాన్ని కనుగొని వారి ఆవేదనను కొంతమేర తగ్గించాయి. బంధువులందరూ కలిసి వెతికినా దొరకని లక్ష్మయ్య ఆచూకీ ..పెంపుడు శునకాల వల్ల సాధ్యమైందని గ్రామస్థులు అంటున్నారు. గుప్పెడు అన్నం పెట్టినందుకు తమ రుణం తీర్చుకున్నాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి

నాలుగు రోజులైనా.. రైతు లక్ష్మయ్య ఆచూకీ ఏది?

Intro:ap_gnt_48_11_polings _status_avb_c9

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పోయాలింగ్ మందకొడిగా కొనసాగుతుంది.ఈవిఎం ల మొరాయింపుతో చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది.అయితే చాలా చోట్ల సరైన సదుపాయాలు లేవనీ... ఉదయ 9 గంటలకు వచ్చిన ఇప్పటివరకు క్యూలైన్ లోనే నుంచి ఉన్న పరిస్థితి అని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటె నగరం మండలం లోని 173వ పోలింగ్ కేంద్రంలో శివయ్య అనే దివ్యంగుడి ఓటును బూతు సిబ్బంది వేశారని బాధితుడు వాపోతున్నాడు. ఇదిలా ఉండగా అదే బూతులో ఉన్న సిబ్బంది పై వైసిపి కార్యకర్తలు ఓటింగ్ సరిగా నిర్వహించడం లేదంటూ వాగ్వాదంకి దిగారు.దీనితో కొద్దీ సేపు పోలింగ్ నిలిచిపోలింది.మరో వైపు రేపల్లె ఓపెన్ థియేటర్ పోలింగ్ కేంద్రం వద్ద వైసిపి,టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి గోడవను అదుపు చేశారు.

Body:బైట్..విజువల్స్ లో దివ్యంగుడి బైట్

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
Last Updated : Aug 28, 2019, 10:33 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.