ETV Bharat / state

సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారు: వైద్యులు

మాజీ ఎంపీ సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

sabbam hari
సబ్బం హరి
author img

By

Published : Apr 26, 2021, 11:17 AM IST

మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖలోని ప్రైవేట్​ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు. చికిత్సకు కొంతవరకు సబ్బం హరి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.

కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.. కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్​ 15న కొవిడ్​ నిర్ధారణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. బుధవారం ఆసుపత్రికి షిఫ్ట్​ అయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్​పై ఉన్నారు. సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: కరోనా కాటు: కుమారుడి మరణవార్త విని ఆగిన తండ్రి గుండె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.