ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణ పనులను నెలాఖరుకు ప్రారంభించి...మార్చి 2021 నెలాఖారుకు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన... గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రాల భవానాల ప్రహరీల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు.
వివిధ పథకాల కింద పనులను సమీక్షిస్తూ జిల్లాకు రూ.447 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. డిసెంబర్ నాటికి రూ. 284 కోట్ల పనులు పూర్తి చేయటానికి ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. మార్చి నాటికి మిగిలిన రూ. 163 కోట్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గురువారం పనుల పురోగతిని సమీక్షిస్తామని వెల్లడించారు. నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు.
ఇదీ చదవండి