విశాఖ జిల్లా చోడవరంలో ఖరీఫ్ సాగుకు సరిపడా విత్తనాలను అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. మండలంలో 5,040 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులకు... ఎకరానికి ఒక వరి బస్తా చొప్పున రాయితీ విత్తనాలను వ్యవసాయ శాఖ అందజేసింది. వివిధ రకాలకు చెందిన విత్తనాలు 110 టన్నుల మేర సరఫరా చేసింది. ఈ మేరకు మండలంలోని రాయపురాజుపేట పంచాయతీ కార్యాలయంలో... జడ్పీటీసీ మాజీ సభ్యులు బొడ్డేడ సూర్యనారాయణ పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: ఈఎస్‌ఐ వ్యవహారంపై హైకోర్టులో విచారణ... ఈ నెల 25కు వాయిదా