అనంతపురం జిల్లా చిన్నముస్తూరు మోడల్ స్కూల్ వద్ద క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారు ఘర్షణకు దిగారు. ఒకే గ్రామానికి చెందిన 161 మంది ఉన్న కేంద్రంలోకి మరో వ్యక్తిని తెచ్చారని ఆరోపించారు. బయట గ్రామం నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని క్వారంటైన్ కేంద్రం నుంచి పంపిచాలంటూ ఆందోళనకు దిగారు. సదరు వ్యక్తిని బయటకు పంపాలంటూ రాత్రి భోజనం మానేసి వలస కూలీలు నిరసన తెలిపారు.
ఇవీ చూడండి..