దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ (డీమ్డ్ యూనివర్శిటీ) ఆగ్రా.. అనుబంధ సంస్థ డీఈఐ ఇన్ఫర్మేషన్ సెంటర్ విశాఖలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు ఉన్నాయన్నారు. పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తులకు అర్హులని తెలిపారు.
జూన్లో పదో తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వయోపరిమితి ఓసీ విద్యార్థులకు 25 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 22 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తులకు మే నెలాఖరువరకు గడువుగా పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి సీట్లు ఇస్తామన్నారు. వివరాలు 9963340611 నంబరులో సంప్రదించవచ్చు.
ఇదీ చదవండి: