దివ్యాంగుల హక్కుల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా దివ్యాంగుల మహాసేన విశాఖ జీవీఎంసీ పార్కులో ఆందోళన చేపట్టింది. 2016లో పార్లమెంటు ఆమోదం పొందిన దివ్యాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవటం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టాన్ని అమలు చేయకపోవటం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నామని వాపోయారు. తమ సమస్యలపై గత ప్రభుత్వాలకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా...ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దివ్యాంగ నిరుద్యోగులకు ప్రతి ప్రభుత్వ శాఖలో రావాల్సిన 4 శాతం ఉద్యోగాలను వెంటనే ఇప్పించాలన్నారు.
ఇదీచదవండి