ETV Bharat / state

విశాఖలో పోలీసు కార్యాలయాలకు అనువైన భూములపై డీజీపీ ఆరా

రాష్ట్ర పోలీసు కార్యాలయాలకు అనుకూలమైన భూములను, భవనాలను డీజీపీ గౌతం సవాంగ్‌ శనివారం విశాఖలో పరిశీలించారు. రుషికొండ ఐటీ హిల్స్‌-2కు వెళ్లి అక్కడున్న ఐటీ సంస్థల భవనాలను పరిశీలించారు.

విశాఖలో పోలీసు కార్యాలయాలకు అనువైన భూములపై డీజీపీ ఆరా
విశాఖలో పోలీసు కార్యాలయాలకు అనువైన భూములపై డీజీపీ ఆరా
author img

By

Published : Jul 5, 2020, 9:39 AM IST

రాష్ట్ర పోలీసు కార్యాలయాలకు అనుకూలమైన భూములను, భవనాలను డీజీపీ గౌతం సవాంగ్‌ శనివారం విశాఖలో పరిశీలించారు. రుషికొండ ఐటీ హిల్స్‌-2కు వెళ్లి అక్కడున్న ఐటీ సంస్థల భవనాలను పరిశీలించారు. న్యూనెట్‌ సంస్థకు చెందిన భారీ భవనాన్ని సందర్శించి అందులోని వసతులపై ఆరా తీశారు. ఆ భవనంపై మరో అంతస్తు నిర్మించడానికి అవకాశం ఉందా అన్న విషయాన్ని వాకబు చేశారు. పరిసరాల్లో పోలీసు విభాగ అవసరాలకు అనువుగా ఎవరి భవనాలు ఉన్నాయన్న దానిపై ఆరా తీశారు. తొట్లకొండలో గ్రేహౌండ్స్‌ విభాగం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. మదురవాడలో అధికారుల నివాసాలకు అనువైన నిర్మాణాలు ఏమున్నాయో చూశారు.

గ్రేహౌండ్స్‌ విభాగానికి ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రభుత్వం ఇటీవలే కేటాయించిన భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు. అడవివరం నుంచి నీళ్లకుండీల సెంటర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. సింహపురి లేఅవుట్‌ వెనుక భాగంలో ఉన్న అటవీ భూముల వివరాలు తెలుసుకున్నారు. అటవీశాఖ అధికారులు వచ్చి డీజీపీతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల అనుకూల, ప్రతికూలతలను డీజీపీ గౌతం సవాంగ్‌కు సీపీ ఆర్‌.కె.మీనా వివరించారు. పరవాడ ఫార్మాసిటీలో ఇటీవల ప్రమాదం జరిగిన సాయినార్‌ సంస్థకు వెళ్లి ఘటన జరగడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలపై సీపీ, డీఐజీని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

'భూ కబ్జాల కోసమే విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.