ETV Bharat / state

Simhachalam సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇక్కట్లు.. కనీస సౌకర్యాలు లేవంటూ మండిపాటు - సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Devotees Problems: చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూపాన్ని చూసేందుకు సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. కనీస సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి బస్సుల కొరతతో.. కొండ కింద పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

devotees problems
భక్తుల ఇబ్బందులు
author img

By

Published : Apr 23, 2023, 10:04 AM IST

Updated : Apr 23, 2023, 11:37 AM IST

Devotees Problems: సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. అప్పన్న నిజరూప దర్శనం కోసం బారులుతీరారు. దీంతో కనీస సౌకర్యాలు లేక క్యూలైన్లలో పిల్లలు, వృద్ధులు, మహిళలు.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు క్యూలైన్‌లో గంటలతరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

కొండపైకి బస్సుల కొరతతో చందనోత్సవ భక్తులు కొండ కింద ఎదురుచూపులు చూస్తున్నారు. సింహగిరి ఘాట్‌రోడ్డులో వాహన రాకపోకలు స్తంభించాయి. బస్సులు నిలిచిపోవడంతో అనేక మంది భక్తుల నడిచి వెళ్తున్నారు. వీఐపీ వాహనాలు భారీగా కొండపైకి చేరుకున్నాయి. దేవస్థానం సిబ్బంది, పోలీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణద్వారం నుంచి పోలీసులు దర్శనాలు చేయిస్తున్నారని భక్తుల ఆరోపిస్తున్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బందితో భక్తుల వాగ్వాదానికి దిగారు.

1500 టికెట్‌ తీసుకున్న భక్తులకు రెండున్నర గంటలకు పైగా సమయం పడుతుంది. క్యూలైన్లలో సుమారు 3 వేల మందికి పైగా రూ.1500 టికెట్‌ భక్తులు ఉన్నారు. దీంతో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. ప్రొటోకాల్ ఉన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. విశాఖ మేయర్‌..హరివెంకట కుమారిని అధికారులు పట్టించుకోలేదు. ఐఏఎస్ అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్ జడ్జిలు, ఉన్నతాధికారులు సైతం గంటల తరబడి వేచిఉన్నారు.

మంత్రి బొత్సను నిలదీసిన భక్తులు: సింహాచలంలో గాలిగోపురం వద్ద.. మంత్రి బొత్స సత్యనారాయణను భక్తులు నిలదీశారు. మంత్రి బొత్సకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.1500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసినా క్యూలైన్లు కదలట్లేదంటూ.. ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భక్తుల ఇబ్బందులపై దేవదాయశాఖ అధికారులను బొత్స ప్రశ్నించారు. దర్శనానికి ఎందుకు ఆలస్యం అవుతోందని అడిగారు. క్యూలైన్లలో భక్తులను వేగంగా పంపే ఏర్పాట్లు చేయాలన్న తెలిపారు.

మంత్రి కొట్టు సత్యనారాయణపై భక్తుల ఆగ్రహం: అదే విధంగా దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. రూ.1500 టికెట్‌ తీసుకున్నా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్న భక్తులు.. క్యూలైన్లలో తాగునీరు సహా కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. దర్శనానికి ఇంకా ఎన్ని గంటలు పడుతుందని నిలదీశారు.

శారదా పీఠాధిపతి అసంతృప్తి: అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై శారదా పీఠాధిపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించారంటూ.. గుంపులుగా పోలీసులను పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని స్వరూపానందేంద్ర ఆరోపించారు. నా జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని.. దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని అన్నారు.

కొండ కింద నుంచి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరని.. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని.. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదని ఆరోపించారు.

Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇక్కట్లు

ఇవీ చదవండి:

Last Updated : Apr 23, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.