Derails goods train near Duvvada: విశాఖ జిల్లా దువ్వాడ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ప్రమాదంలో ఒక ఖాళీ బోగీ పూర్తిగా దెబ్బతింది. గంగవరం పోర్టులో లోడును నింపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు 4 గంటల పాటు 8 రైళ్లు నిలిచిపోయాయి.
ట్రాక్ బాగా దెబ్బతింది. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ ద్వారా ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి చేశారు. పనులు పూర్తికావడంతో.. రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. రైళ్లు ఆలస్యం కారణంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.
ఇదీ చదవండి..: