కరోనా వైరస్ సోకి.. విశాఖ జిల్లా మాకవరపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ లక్ష్మణ కుమార్ (34) మృతి చెందారు. లక్ష్మణకుమార్ కొద్దిరోజుల క్రితం వరకు కోవిడ్‌తో విశాఖపట్నంలో చికిత్స పొందారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారికంగా ధ్రువీకరించారు. మాకవరపాలెంలో స్వచ్ఛంద లాక్డౌన్ మరింత పటిష్టంగా నిర్వహించేందుకు వ్యాపారులు నిర్ణయించుకున్నారు. ఉప సర్పంచ్ మృతికి స్థానికులు, నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: