ఈనెల 19న విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ రోజు జి.కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన హెచ్.ఎంతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరై.. సెలవులో ఉన్నట్లు చెప్పారు. చీడికాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మరో ఉపాధ్యాయుడు విధులకు ఆలస్యంగా వచ్చారు. అనంతరం ఆయా పాఠశాలల్లో సదరు నలుగురు ఉపాధ్యాయులపై విచారణ చేపట్టారు. మొత్తం నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు.. చీడికాడ మండల విద్యా శాఖాధికారి గంగరాజు తెలిపారు. షోకాజ్ నోటీసులకు సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నట్లు వివరించారు.
ఇవీ చూడండి...: 'పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను విడిచిపెట్టాలి'