విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయి రెడ్డి, డాక్టర్ సత్యవతి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో రబీ సీజన్, వ్యవసాయ ప్రణాళిక అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకున్నారు. కొవిడ్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఆర్థిక అంశాలు బలోపేతం చేయడంపైనా చర్చించారు. విద్య, వైద్యారోగ్య, జీవీఎంసీ, అటవీ, గనుల శాఖ సహా విభాగాల అధికారులతో అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు.
ఇదీచదవండి