విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీరాంపురం గ్రామంలో రహదారికి అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో అంబేడ్కర్ పార్క్, గ్రంథాలయ నిర్మాణం చేపడతామని దళిత నాయకుడు ఏనుగుపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఈ స్ధలం తమ పూర్వీకుల నుంచి ఆధీనంలో ఉందని చెప్పారు. తాము ఆక్రమించినట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో పార్క్, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విజ్ఞాన మందిరం, సామాజిక భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు
ఇదీ చదవండీ.. cross firing: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. ఐదుగురు మృతి?!