విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక విశాఖలో ఆందోళన చేపట్టింది. భాజపా అధికారం చేపట్టాక ప్రభుత్వ సంస్థలన్నింటినీ బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డాబా గార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్టీల్ ప్లాంట్... నష్టాల ఊబిలో ఉందని దుష్ప్రచారం చేసి ప్రైవేటీకరణకు పూనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి