ETV Bharat / state

బ్యాంక్ మేనేజర్​నంటూ.. మనీ కాజేశాడు - విశాఖలో సైబర్​ నేరగాళ్లు తాజా వార్తలు

బ్యాంక్​ మేనేజర్​ను ఫోన్​ చేస్తున్నాను.. మీ ఏటీఎం వివరాలు చెప్పడంటూ ఫోన్​ చేసి ఖాతా నుంచి రూ. 20 వేల రూపాయలు కాజేసిన ఘటన విశాఖ జిల్లా మన్యంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చెశాడు.

cyber crime persons theft amount in atm
విశాఖ ఏజెన్సీలో సైబర్​ మోసగాళ్లు
author img

By

Published : May 22, 2020, 7:53 PM IST

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పలురకాల ఎత్తుగడలతో వ్యక్తుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తూనే ఉన్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం కొత్తపల్లిలో గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్​గా మాధవి అనే మహిళ ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త ఇమాన్యుల్​కు బ్యాంకు మేనేజర్​నంటూ ఒక వ్యక్తి నుంచి ఫోన్​కాల్ చేశాడు. మీ ఏటీఎం కార్డు గడువు ముగిసింది... వివరాలు చెప్పాలంటూ అడిగారు. విషయం గుర్తించలేని ఇమాన్యూల్​ ఫోన్​లో వచ్చిన ఓటిపి చెప్పగానే ఖాతా నుంచి రూ. 20,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు చోరీ చేశారు.

బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్​ డ్రా అయ్యిందని తెలుసుకున్న ఖాతాదారుడు లబోదిబోమన్నాడు. విషయాన్ని ఏఎస్పీ సతీష్ కుమార్​కు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఎకౌంట్​కు సంబంధించిన నగదు లావాదేవీలు, ఏటీఎం వివరాలు ఏ వ్యక్తి ఫోన్​లో అడిగినా చెప్పకూడదని సూచించారు. ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ సతీష్ కుమార్ సూచించారు.

ఇవీ చూడండి...

విశాఖ దుర్ఘటనపై కేంద్ర రసాయన నిపుణుల కమిటీ పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.