విశాఖ జిల్లా అనకాపల్లి పూడిమడక జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు రావటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మరో యువకున్ని పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నించగా అతని వద్ద 10 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జగన్నాథపురానికి చెందిన యువకులు జల్సాలకు అలవాటు పడి గంజాయి తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పరారైన ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై రాము తెలిపారు.
అనకాపల్లిలో గంజాయి పట్టివేత - vishakapatnam latest news
జల్సాల కోసం యువకులు కొత్త దారులు వెతుకుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో గంజాయిని తరలించేందుకు సిద్ధపడుతున్నారు. అనకాపల్లిలో ముగ్గురు వ్యక్తుల నుంచి పది కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు పరారు కాగా మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లి పూడిమడక జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు రావటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మరో యువకున్ని పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నించగా అతని వద్ద 10 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జగన్నాథపురానికి చెందిన యువకులు జల్సాలకు అలవాటు పడి గంజాయి తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పరారైన ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై రాము తెలిపారు.
ఇదీ చదవండి: అనకాపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు