కరోనా లాక్డౌన్తో అవస్థలు పడుతున్న మారుమూల ప్రాంత గిరిజనులకు సీఆర్పీఎఫ్ పోలీసులు అండగా నిలిచారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం ఎన్.కొత్తూరు, మద్దివీధి, మండివనం గ్రామాల్లో 120 మంది గిరిజన కుటుంబాలకు 198 బెటాలియన్ సీ కంపెనీ సీఆర్పీఎఫ్ పోలీసులు నిత్యావసరాలు అందజేశారు. కష్టకాలంలో సహాయం అందించిన పోలీసులకు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి..