విశాఖ మన్యంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సీఆర్పీఎఫ్ డీజీపీ మహేశ్వరి ఏరియల్ సర్వే చేశారు. హెలికాఫ్టర్లో అక్కడకు చేరుకుని విశాఖ మన్యంలో పర్యటించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు, సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకుగాను భారీగా భద్రతా బలగాలను పంపనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి...