విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కేఎల్బీ పట్నం, ఎల్బీ పట్నాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరి పొలాలు.. చెరువులను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువు, గెడ్డల నుంచి వరద నీరు జోరుగా పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఫలితంగా.. పంట పొలాల్లోకి చేపలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో కొందరు రైతులు ఆందోళన చెందుతుండగా... మరికొందరు స్థానికులు పొలాల్లో వలలు వేసి చేపలు పడుతున్నారు.
ఇదీ చూడండి:
నివర్ తుపాన్: నెల్లూరు, రాయలసీమకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన