విశాఖలో స్థిరాస్తి సమకూర్చుకోవాలనే వారి ఆలోచనలకు అనుగుణంగా భారీ ప్రాపర్టీ ఎక్స్ పో ఏర్పాటు చేస్తున్నట్లు క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ వెల్లడించింది. బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్లో డిసెంబర్ 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, నిర్మాణ రంగ వస్తువులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటుందన్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: