తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించి.. కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ధర్నాకు దిగారు. జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు ఆధార్ కార్డులో తప్పుడు వయస్సు మార్పిడిచేసి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్.రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: