గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి.. పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వచ్చే నెల 9న జరిగే ఆదివాసుల దినోత్సవం సందర్భంగా... భూ పంపిణీ కార్యక్రమంలో వీరందరికీ పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని గిరిజన గ్రామాలను సందర్శించారు.
మండలంలోని 16 గ్రామాల్లో గిరిజనులు జీవిస్తున్నారని, వీరంతా ఆయా సమీపంలోని అటవీ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ నేటి వరకు సాగు హక్కు పత్రాలను పంపిణీ చేయలేదని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సీపీఎం నాయకులు చిరంజీవి, శ్రీనివాసరావు తదితరులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: