విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం ప్రైవేటుపరం చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనకు నిరసనగా... విశాఖలోని సీపీఐ నేతలు నిరసనకు దిగారు. రాస్తారోకోకు పిలుపునిచ్చిన సీపీఐ నేతలు.. నగరంలోని అల్లిపురం కూడలి వద్ద ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను.. కేంద్రం ప్రైవేటు పరం చేస్తుంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించటంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన పార్టీ భాజపా నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కుపై సీఎం అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబు