విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి కొమరవోలు, జానకీ రాంపురం, కొవ్వూరు, అమలాపురం, నాతవరం, మర్రిపాలెం, గొంప, రాజాం తదితర ప్రాంతాల్లో ప్రైవేటు రంగంలో జీడిపిక్కలు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఈ కర్మాగారాల్లో వివిధ మండలాలకు చెందిన సుమారు ఐదు వేల మంది కార్మికులు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. కొద్దిరోజులుగా మలివిడత కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుండడంతో... ఈ ఫ్యాక్టరీలకు వచ్చే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. సగటున 30 నుంచి 35 శాతం మంది కార్మికులతో నెట్టుకొస్తున్నటు నిర్వాహకులు చెబుతున్నారు.
మరోపక్క ఈ సీజన్లో జీడిపిక్కలు సేకరణ అధికంగా ఉండటంతో ఇప్పుడే కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. సేకరించిన జీడి పిక్కలను మహిళలు గ్రేడింగ్ చేసి కేటగిరీల వారీగా విభజన చేసిన తరువాత వాటిని ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తుంటారు. వైరస్ ప్రభావం రోజు రోజుకి తీవ్రతరమవుతుంది. ఈ నేపథ్యంలో...ఫ్యాక్టరీల్లో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే...కర్మాగారాలు మూసివేయక తప్పదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: ఏడాదిలో ముగ్గురి మృత్యువాత.. అనాథలుగా మారిన కవల పిల్లలు