విశాఖ జిల్లా మాడుగులలో కొవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్ కేంద్రంలోని వసతులు విప్ పరిశీలించారు. కరోనా భాదితులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఇక్కడ కేంద్రంలో సాధారణ పడకలతో పాటు, 10 ఆక్సిజన్ పడకలు, అంబులెన్స్, భోజన సదుపాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: