పాడేరు జిల్లా ఆస్పత్రిలో వంద పడకలతో కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ మన్యం ఐటీడీఏ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందులో 20 ఆక్సిజన్ పడకలన్నాయనీ.. మరో 30 వరకు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రస్తుతం పాడేరు పెదబయలులో కొవిడ్ కంట్రోల్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం కొవిడ్ సెంటర్లో భోజనం, వసతి కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. శానిటేషన్ పనులకు స్థానికులు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో.. ప్రైవేట్ సర్వీస్‌కు పనులు అప్పగించినట్లు తెలిపారు. పాడేరు మన్య వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు తెరవకపోవటం శుభపరిణామమని అన్నారు. మన్యంలో కరోనా సమాచారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామనీ.. కరోనా అనుమానితులు ఎవరైనా 180042500004 ఈ నెంబర్‌కి ఫోన్ చేసి వివరాలు అందజేయవచ్చునని సూచించారు.
ఇదీ చదవండి: చోడవరం నియోజకవర్గంలో ఒక్క రోజే 14 మందికి కరోనా