ETV Bharat / state

స్కిల్ డెవలప్మెంట్ కేసులో.. ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు - సీమెన్స్‌ ఈడీ కస్టడి

ED probe in Skill Development Corporation case: ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) కేసులో అరెస్ట్ చేసిన నలుగురిని ఈడీ కస్టడీ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయముర్తి ఎం తిరుమలరావు తీర్పు వెలువరించారు. ఈడీ నలుగురిని 15 రోజుల కస్టడీని కోరగా.. న్యాయముర్తి ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది. వీరిని న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని అదేశించింది.

Skill Development Corporation Case
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
author img

By

Published : Mar 14, 2023, 9:29 AM IST

Skill Development Corporation Case: ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధుల దుర్వినియోగం కేసులో ఆరెస్టయిన నిందితులను ఈడీ విచారణకు అనుమతిస్తూ న్యాయస్ధానం తీర్పునిచ్చింది. ఈనెల నాలుగున సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండి వికాస్ వినాయక్ , పీవీఎస్పీఐటీ స్కిల్ సీఈవో ముకుల్ చంద్ అగర్వాల్, సారా చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రతినిధి సురేష్ గోయల్ లను ఈడి అరెస్ట్ చేసి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించింది. తదుపరి విచారణ కోసం తమకు ఇవ్వాలని దాఖలుచేసిన పిటిషన్ పై విశాఖలోని ఎం.ఎస్.జే. కోర్టు జడ్జి ఎం తిరుమలరావు ఈనెల 10 న వాదోపవాదనలు విన్నారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయముర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఈడీ ఈ నలుగురిని 15 రోజుల కస్టడీకి కొరింది. ఏడు రోజుల కస్టడీకి మాత్రమే న్యాయస్ధానం అనుమతించింది. రేపటి నుంచి న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని ఈడీని కోర్టు అదేశించింది. విచారణ సమయంలో పాటించాల్సిన నియనిబంధనలను కూడా న్యాయస్ధానం నిర్దేశించింది.

ఇదే అంశంపై కొనసాగుతున్న సీఐడీ విచారణ: వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్​లో అక్రమాలు జరిగాయంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై టీడీపీ నేతలు సైతం ఘాటుగానే స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్​లో అవతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ అధికారులు అప్పటి ఐఏఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ను సైతం ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారించింది.

ఎఫ్‌ఐఆర్‌లో ఏం ఉందంటే? పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు మొత్తంగా ఆరు నైపుణ్య క్లస్టర్ల ఏర్పాటు చేసేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో నైపుణ్య క్లస్టర్‌ ఏర్పాటుకు రూ.546.84 కోట్ల వ్యయం అవుతుంది. అందులో రూ.491.84 కోట్లు (90%) గ్రాంట్​ను ఇన్‌ ఎయిడ్‌ కింద సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ లు సమకూరుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.55 కోట్లు 10% భరించాలి. కానీ డిజైన్‌టెక్‌, సీమెన్స్‌ సంస్థలు డొల్ల కంపెనీల ద్వారా నకిలీ ఇన్వాయిస్‌లతో రూ.241.78 కోట్లు దొచుకున్నాయి. పుణెలో ఉన్న జీఎస్టీ నిఘా విభాగం అదనపు డైరెక్టర్‌ జనరల్‌ దర్యాప్తులో నకిలీ ఇన్వాయిస్‌లకు సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశంపై ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తెలింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.