విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వేర్లమామిడికి చెందిన సూరిబాబు తన కుమార్తె ఓణీల వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చైతన్యరాజు భార్యతో గొడవ పడి ఆమెను నిందిస్తూ గొడ్డలితో శుభకార్యం జరిగే చోటుకు వెళ్లాడు. ఇక్కడ ఏ గొడవపడ్డద్దొంటూ సూరిబాబు చైతన్యరాజుకు సర్ధిచెప్పేందుకు యత్నించాడు. దీంతో చైతన్యరాజు రెచ్చిపోయి సూరిబాబును గొడ్డలితో హతమార్చి.. ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన సూరిబాబు బంధువులు చైతన్యరాజును కాళ్లు చేతులు కట్టేసి దాడి చేసి హతమార్చారు. శుభకార్యం జరగాల్సిన గ్రామంలో జంట హత్యలు జరగడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవీ చదవండి...అనంతపురంలో తాగుబోతు వీరంగం...!