విశాఖలో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల్లో చైతన్యం వచ్చి, ఉదయం నిత్యావసర వస్తువులు తీసుకునే సమయం మినహాయించి ఇళ్లు వదిలి బయటకు రావటం లేదు.
పలు ప్రాంతాల్లో జీవీఎంసీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంయుక్తంగా రసాయనాన్ని పిచికారి చేశారు. నేటికి విశాఖలో కరోనా నిర్ధారిత పరీక్షకు 492 నమూనాలు పంపగా వాటిలో 284 మందికి నెగిటివ్‌గా తేలింది. ఇంకా 193 కేసులు ఫలితం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు వైద్య నిర్బంధంలో ఉన్న వారికి నెగిటివ్ రిపోర్ట్ రావటంతో 156 మందిని వారి వారి గృహాలకు పంపి అక్కడ హోం క్వారంటైన్ కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు.
సోమవారం నుంచి ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ప్రజలు వస్తువులు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. విశాఖ జిల్లా మరియు నగరం కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన మాస్కులు,పీపీటీ కిట్లను అందుబాటులో ఉండేటట్లు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నేతృత్వంలో 21 కమిటీలు పనిచేస్తున్నాయి .అల్లిపురం, అక్కయపాలెం, అనకాపల్లి గ్రామీణ ప్రాంతాలు, అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించి ప్రజలు బయటకు రాకుండా పోలీస్ పహారా కొనసాగిస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌లోని ల్యాబ్ అందుబాటులోకి రావటంతో కరోనా ఫలితాలు మరింత వేగంగా వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కనీస రక్షణ పరికరాలు లేవు: పారిశుద్ధ్య కార్మికులు