ETV Bharat / state

విశాఖను కలవరపెడుతున్న కరోనా.. ఇప్పటికే 4 పాజిటివ్​ కేసులు

విశాఖలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా వచ్చిన వ్యక్తి బంధువే... నాలుగో పాజిటివ్ కేసు కావడం అధికారులను కలవరపెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిపై జిల్లా యంత్రాంగం దృష్టి నిలిపింది. ఈ నేపథ్యంలో విశాఖలో కరోనా పరీక్షా కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

విశాఖలో 4కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
విశాఖలో 4కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Mar 28, 2020, 6:04 AM IST

Updated : Mar 28, 2020, 6:13 AM IST

విశాఖలో 4కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

విశాఖలో కరోనా బాధితుల సంఖ్య 4కు పెరిగింది. ఇప్పటికే కరోనా వచ్చిన వ్యక్తి బంధువుకే తాజాగా వైరస్‌ సోకినట్లు తేల్చారు. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారినిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 112 అనుమానితులకు పరీక్షలు చేయగా 4 గురికి పాజిటివ్.. 96 మందికి నెగటివ్ వచ్చింది. మరో 12 మంది ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. విమ్స్ ను కోవిడ్ -19ఆస్పత్రిగా మార్చి తూర్పుగోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రి , గీతం వైద్య కళాశాల ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే 3 వేల 500 క్వారంటైన్ పడకలు సిద్ధం చేశారు. వేరే రాష్ట్రాలనుంచి రాష్ట్ర వాసులు వస్తే నిర్బంధ కేంద్రాన్ని వేపగుంటలో సిద్ధం చేశారు.

విదేశాల నుంచి.. వచ్చిన వారిపై నిఘా

విశాఖకు 2 వేల 795 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. జీవీఎంసీ పరిధిలో 2 వేల 224 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 571 మంది ఉన్నట్లు గుర్తించారు. సీతమ్మధార, అల్లిపురం, గాజువాక, అనకాపల్లి గ్రామీణ పరిధిలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. 97 బృందాలు నిరంతరం పనిచేసి... అనుమానితులను పరీక్షలకు తరలించే పని చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా పెట్టారు. 21 మందితో జిల్లా కమిటీ వివిధ చర్యలు తీసుకుంటోంది. విశాఖలోని కరోనా కేసుల పరీక్షలకోసం నిర్దేశించిన ఛాతీ ఆసుపత్రిలో సౌకర్యాల లేమిపై ఒక వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియోపై స్పందించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌... లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

కరోనా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి

సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లిని హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించినందున... విశాఖలో కరోనా పరీక్షా కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విశాఖలో ఐసోలేషన్ వార్డులను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య సిబ్బందిని మరింత పెంచాలన్నారు. కనీసం ఒక వైద్య బృందాన్ని ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్తు బిల్లులు, మున్సిపల్​ పన్నులు, నీటి బిల్లులు రద్దు చేయాలని సీఎంని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోరింది. ఈమేరకు లేఖ రాసింది.

నిత్యావసరాలు అందుబాలోనే..

విశాఖలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. రైతుబజార్లకు కూరగాయలు తెచ్చేలా పల్లె వెలుగు బస్‌లకు పచ్చజెండా ఊపారు. వ్యాపార సముదాయల నుంచి హోమ్ డెలివరీకి అనుమతి ఇచ్చారు. విశాఖలోని విశాఖ పోర్ట్ ట్రస్ట్, గంగవరం పోర్టు ట్రస్ట్‌ ద్వారా సరకు రవాణా కొనసాగుతుందన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర వస్తువులు అందించేలా విశాఖలో వివిధ కళాశాలల మైదానాల్లో రైతుబజార్లు నిర్వహిస్తున్నారు.

ఇదీచదవండి

విశాఖ చెస్ట్​ ఆస్పత్రి వీడియో వైరల్: నిజం కాదన్న కలెక్టర్

Last Updated : Mar 28, 2020, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.