విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్స్ లు, ఇద్దరు కౌన్సిలర్లు, సెక్యూరిటీ గార్డుకి కరోనా సోకింది. మొత్తం 9 మంది కరోనా బారిన పడ్డారు. అత్యవసర వైద్య సేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: కరోనా పరీక్షల ప్రత్యేక డ్రైవ్లో 500మందికి పాజిటీవ్