ETV Bharat / state

రాష్ట్రంలో మరో నలుగురికి కరోనా లక్షణాలు - కర్నూలులో కరోనా వైరస్ ఎఫెక్ట్

విశాఖ ఏజెన్సీ చింత‌ప‌ల్లిలో ఓ వ్యక్తికి, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. వారిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్
కరోనా ఎఫెక్ట్
author img

By

Published : Mar 21, 2020, 11:25 PM IST

చింత‌ప‌ల్లిలో క‌రోనా వైర‌స్

విశాఖ ఏజెన్సీ చింత‌ప‌ల్లిలో క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో ఓ వ్య‌క్తి ఆసుప‌త్రిలో చేరారు. విశాఖకు చెందిన ఓ వ్య‌క్తి హైదరాబాద్​లో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా సెల‌వులు ఇవ్వగా హైదరాబాద్​ నుంచి విశాఖ‌ జిల్లా చింత‌ప‌ల్లి వచ్చాడు. మూడు రోజులుగా ఆ వ్యక్తికి త‌ల‌నొప్పి, జ్వ‌రం, ద‌గ్గుతో బాధపడుతున్నాడు. కరోనా లక్షణాలున్నట్లు అనుమానంతో స్వ‌యంగా వ‌చ్చి ఆసుప‌త్రిలో చేరారని డిప్యూటి సివిల్ స‌ర్జ‌న్ ఉమామ‌హేశ్వ‌ర‌రావు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విశాఖ చాతి, శ్వాస‌కోస వ్యాధుల ఆసుప‌త్రికి తరలించామన్నారు.

యానం పరిసర ప్రాంతాల్లో ముగ్గురికి కరోనా వైరస్​ లక్షణాలు

యానాం పరిసర ప్రాంతంలో ముగ్గురికి

యానాం పరిసర గ్రామాలైన తాళ్లరేవు మండలానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని ప్రత్యేకగదుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. మస్కట్ నుంచి యానాంకు వచ్చిన మహిళలకు వైరస్ లక్షణాలు ఉండగా వైద్య పరీక్షలకు పంపించినట్లు డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

యాత్రకు వెెళ్లిన గ్రామస్ధులను ఊర్లోకి అనుమతించని పెద్దలు

ఊర్లోకి అనుమతించని పెద్దలు

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామంలో కరోనా అనుమానంతో గ్రామస్థులను ఊర్లోకి అనుమతించ లేదు. గ్రామానికి చెందిన 35 మంది తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లి బొల్లవరం చేరుకున్నారు. కరోనా వదంతుల నేపథ్యంలో గ్రామ పెద్దలు వీరిని అనుమతించ లేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల అనంతరం వారికి ఎటువంటి లక్షణాలు లేవని తేలగా ఇళ్లకు పంపారు.

ఇవీ చదవండి

'ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.