విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 39 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 18 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వారిలో ఎక్కువ మంది మర్రిపాలెం, దండుబజార్, చందకవీధి ప్రాంత వాసులు ఉన్నారు. నగర ప్రాంతంలో కేసులు పెరగడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో వీధుల్లో కూర్చుని ఆడిన బృంద ఆటలు వల్ల కరోనా వ్యాప్తి చెందిందని పరిశీలనలో తెలిసింది. కొత్త కేసులు వచ్చిన ప్రాంతాల్లో లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. జీవీఎంసీ సిబ్బంది రసాయనం పిచికారి చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా కేసులు రావడంతో విశాఖలో కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 60 కేసులు