విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 30 కేసులు నమోదవటంతో అధికారుల్లో గుబులు మొదలైంది. మరోపక్క ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పట్టణంలో పాక్షిక లాక్ డౌన్ అమలవుతోంది. తాజా కేసులు బలిఘట్టం, పెద్దపల్లి, నర్సీపట్నం, లక్ష్మీపురం, అయ్యన్నకాలనీ, కొత్తవీధిలో వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వైద్యులు, ఎస్సై, మలేరియా విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి వైరస్ బారిన పడ్డారు.
ఇవీ చదవండి...