విశాఖ జిల్లా ఎన్నికల్లో మద్యం విచ్చలవిడి అమ్మకాలు, పంపిణీలు జరగకుండా నగర పోలీసు ఉన్నతాధికారులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున కొనుగోళ్లు చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం తదితరాలను గుర్తించేందుకు వీలుగా 24 గంటల కంట్రోల్‌రూంను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆ నంబరుకు ఫోన్ చేసి మద్యం సంబంధిత ఉల్లంఘనలు, అక్రమాలపై ఎప్పుడైనా సమాచారం ఇవ్వవచ్చు.
ఎస్.ఎం.ఎస్.లు చేయడంతోపాటు, ఫొటోలు, వీడియోలను వాట్సప్ కూడా చేయవచ్ఛు ఇప్పటికే మద్యం సంబంధిత నేరాల్లో నిందితులుగా ఉన్నవారిపై కూడా పోలీసులు, సెబ్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. నేరచరిత్ర ఉన్నవారి బైండోవర్లు కూడా తెరిచే కార్యక్రమాల్ని ప్రారంభించారు. సెబ్‌లో విధులు నిర్వర్తిస్తున్న డీసీ, ఏసీ, సీఐలు, ఎస్.ఐ.లు తదితరులతో సెబ్ ఏడీసీపీ వేజెండ్ల అజిత సమావేశమై ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు.
- సెబ్ కంట్రోల్ రూం నెంబరు: 9440904317
- సెబ్ ఈ-మెయిల్ చిరునామా: sebvspcity@gmail.com
ఇదీ చదవండి: