విశాఖ జిల్లా నర్సీపట్నం శారదా నగర్లో కానిస్టేబుల్ భార్య అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించగా.. చనిపోయి కనిపించింది. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తవిటి నాయుడుకు గత ఫిబ్రవరిలో చతురతో వివాహమైంది. అతనికి ఇది రెండో పెళ్లి. పెళ్లైనప్పటినుంచి తమ కుమార్తెను భర్త వేధిస్తున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి.. అప్పు తీర్చలేదని.. చంపేశారు..!