వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ... ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు సంతకాల సేకరణ ప్రారంభించారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల సంతకాలు సేకరించాలని భావించామని ఆయన తెలిపారు.
భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతులకు కీడు చేసే బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 2 కోట్ల సంతకాల సేకరణకు అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: మా పాలనలో వ్యవసాయం పండగ: మంత్రి అవంతి