కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్ణబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పాయకరావుపేటలో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్సీ సెల్ నాయుడు, బుర్తి యేసు ఆధ్వర్యంలో శిక్షణ డీఎస్పీ కిరణ్ కుమార్కు ఫిర్యాదు కాపీ అందించారు. లాక్డౌన్ కారణంగా దేశంలో అనేకమంది పేదలు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేద, మధ్య కుటుంబాలకు రూ.7,500 ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
ఇది చదవండి విశాఖ అందాలు... చూడాలంటే చాలవు రెండు కళ్లు