రైతు బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 2 కోట్ల సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా పాయకరావుపేటలో మొదలు పెట్టారు. పార్టీ నియోజకవర్గ బాధ్యులు తాళ్లూరి విజయ కుమార్ ప్రారంభించారు. భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని విజయ్ కుమార్ సూచించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దాడులకు తెగబడు తున్నారని ఆరోపించారు. తక్షణమే బిల్లులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు అందజేస్తాం'